ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:09 PM
ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదుగుతుందని ఆర్‌ఎ్‌సఎస్ దక్షిణ మద్య క్షేత్ర సహ ప్రచారక్ భరత్‌జీ అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలోని మహంకాళీ ఆలయ ఆవరణలో ఆర్‌ఎ్‌సఎస్ మల్కాజ్‌గిరి బాగ్ మహా సాంఘిక్ నిర్వహించారు.
ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సహ ప్రచారక్ భరత్‌జీ
కీసర రూరల్, డిసెంబరు 24 : ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదుగుతుందని ఆర్‌ఎ్‌సఎస్ దక్షిణ మద్య క్షేత్ర సహ ప్రచారక్ భరత్‌జీ అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలోని మహంకాళీ ఆలయ ఆవరణలో ఆర్‌ఎ్‌సఎస్ మల్కాజ్‌గిరి బాగ్ మహా సాంఘిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి బాగ్ పరిధిలోని 80బస్తీలు, 12 గ్రామాలు నుంచి ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలు విచ్ఛేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి వంతమైన సమాజం కోసం సంఘశాఖను పటిష్టం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 1.15 లక్షల సంఘ శాఖలు కొనసాగుతున్నాయన్నారు. 2025 ఆర్‌ఎ్‌సఎస్ శతజయంతి ఉత్సవం నాటికి భారతదేశాన్ని విశ్వగురుస్థానానికి చేర్చేందుకు కృషి చేయాలన్నారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్షింతలను దేశ వ్యాప్తంగా 25వేల కోట్ల కుటుంబాలకు చేరవేసేందుకు తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించిందన్నారు. అదే రోజున దేశ వ్యాప్తంగా ఆయాల్లో శ్రీరామ నామ కీర్తనలతో ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ సంభాగ్ సంఘ చాలక్ డా. గంజం క్రిష్ణప్రసాద్, మల్కాజ్‌గిరి భాగ్ సంఘ చాలక్ డా. నాగమోహన్, సంఘ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 11:09 PM