ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

55 ఏళ్ల పాలనలో..కాంగ్రెస్‌ 6 గంటలే కరెంట్‌ ఇచ్చింది: కేటీఆర్‌

ABN, Publish Date - Dec 22 , 2023 | 04:06 AM

గత 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గంటల కరెంటే ఇచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్‌ శాఖ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గత 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గంటల కరెంటే ఇచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్‌ శాఖ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2014 నాటికి 6 గంటల కరెంటే ఇచ్చామని శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్‌ వాళ్లే స్పష్టం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నీళ్లు, బొగ్గు లేని విజయవాడ, కడపలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. నేదునూరు, శంకర్‌పల్లిలో గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తామని భూసేకరణ చేశారని అన్నారు. శంకర్‌పల్లి, నేదునూరులో తాము ధర్నా చేశామని చెప్పారు. యూపీఏ హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్నప్పటికీ గ్యాస్‌ కేటాయించలేదని, అందుకే ఆ రెండు ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 04:07 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising