ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తండ్రి ఇలాకాలో.. వారసులకు ‘పరీక్ష ’

ABN, First Publish Date - 2023-08-02T15:25:35+05:30

నగర రాజకీయాల్లో పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్‌)ది చెరగని ముద్ర. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధిండచంతోపాటు పేదల పక్షపాతిగా ఎంతో ఖ్యాతి తెచ్చుకున్నారు.

  • ఎన్నికల్లో పోటీకి సై అంటున్న పీజేఆర్‌ బిడ్డలు

  • కాంగ్రె్‌సలోనే విష్ణువర్ధన్‌రెడ్డి, విజయారెడ్డి

  • టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు

  • ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన పీవీఆర్‌

  • గతంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ విజయారెడ్డి

  • బీఆర్‌ఎ్‌సను వీడి హస్తం పార్టీతో చెలిమి

  • జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ స్థానాల్లో పోటీకి యత్నం

  • ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు వచ్చేనా ?

బంజారాహిల్స్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): నగర రాజకీయాల్లో పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్‌)ది చెరగని ముద్ర. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధిండచంతోపాటు పేదల పక్షపాతిగా ఎంతో ఖ్యాతి తెచ్చుకున్నారు. జన్నన్నా.. అంటే నేనున్నా అనే ఆయన నిత్యం పేదల పక్షానే కొట్లాడేవారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే వాలిపోయేవారు. 2007లో పీజేఆర్‌ గుండెపోటుతో మరణించాక ఆయన వారసుడిగా తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి(పీవీఆర్‌) రాజకీయ ప్రవేశం చేశారు. తండ్రి మరణంతో జరిగిన ఉపఎన్నికలో పీవీఆర్‌ ఘనవిజయం సాధించారు.

ఖైరతాబాద్‌ అంటే పీజేఆర్‌

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఖైరతాబాద్‌ నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇక్కడి నుంచి పీజేఆర్‌ పోటీలో ఉన్నారంటే గెలుపు ఖాయం. ప్రత్యర్థి ఎలాంటి వారైనా ఓటమి తప్పేది కాదు. పేదలు, మధ్య, ధనిక వర్గాల్లో ఇప్పటికీ ఆయనంటే అభిమానం. మురికివాడల్లో ఆయన నామస్మరణ చేస్తే ఇప్పటికీ ఓట్లు పడుతాయంటే అతిశయోక్తికాదు. ప్రత్యర్థులను కూడా తన మిత్రులుగా మలుచుకోగలిగిన దిట్ట. ఇపుడు ఆయన వారసులు విష్ణువర్ధన్‌రెడ్డి, విజయారెడ్డి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి, విజయారెడ్డి ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు.

పీజేఆర్‌ మరణంతో విష్ణు ప్రవేశం

2007లో పీజేఆర్‌ హఠాన్మరణం తర్వాత 2008లో జరిగిన ఉపఎన్నికలో ఆయన వారసుడిగా పి.విష్ణువర్ధన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత ఖైరతాబాద్‌ పునర్విభజన జరగడంతో ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సలీంపై విజయం సాధించి వారసత్వం నిలుపుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మురళీగౌడ్‌ తాజాగా కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్‌రెడ్డి తనకు టికె ట్‌ ఇస్తానని అభయమిచ్చారని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈయనతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని ఉపేందర్‌రెడ్డి కూడా ప్రయత్నాలు ఆరంభించారు.

మొదటి నుంచి ఖైరతాబాద్‌ పైనే దృష్టి

పీజేఆర్‌ వారసురాలిగా విజయారెడ్డి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తండ్రి పోటీ చేసిన సీటు కావడంతో ఖైరతాబాద్‌ కేటాయించాలని కోరారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే అంటూ విజయారెడ్డిని కాదని దానం నాగేందర్‌కు ఖైరతాబాద్‌ టికెట్‌ ఇచ్చారు. శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి ఇవ్వాలని విజయారెడ్డి కోరినా అప్పట్లో అధిష్ఠానం పట్టించుకోలేదు. చేసేదిలేక శేరిలింగంపల్లిలో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎ్‌సఆర్‌సీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చే శారు. ఒక రకంగా ఆమె బరిలో నిలవడం వల్ల దానంకు పడాల్సిన ఓట్లు చీలిపోవడంతోపాటు టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. విజయారెడ్డి సుమారు 20 వేల ఓట్లు సాధించి తన ఉనికిని చాటుకున్నారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో గ్రేటర్‌ ఎన్నికల కన్నా ముందు ఆమె అధికార పార్టీలో చేరారు. ఖైరతాబాద్‌ డివిజన్‌ నుంచి రెండుసార్లు పోటీచేసి కార్పొరేటర్‌ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి టికెట్‌ కోసం తీవ్రంగా యత్నించినా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దానం వైపే మొగ్గు చూపించింది. దానం విజయం సాధించడంతో ప్రస్తుతం మరోసారి ఆయన పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సిట్టింగ్‌ ఉండగా తనకు అవకాశం వచ్చేలా లేదని భావించిన విజయారెడ్డి రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఖైరతాబాద్‌ టికెట్‌ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఆమెకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది.

రోహిణ్‌రెడ్డి పరిస్థితి ఏమిటి ?

ఖైరతాబాద్‌ నుంచి మూడుసార్లు టికెట్‌ ఆశించి భంగపడ్డ డాక్టర్‌ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి ఈసారి ఛాన్స్‌ వచ్చి తీరుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీకి విధేయుడిగా ఉండడంతోపాటు రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల డీసీసీ పదవి కూడా వరించింది. విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డిలిద్దరూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇద్దరికీ అవకాశం దక్కేనా ?

కాంగ్రె్‌సలో ఒక కుటుంబం ఒకరికే టికెట్‌ అన్న అంశం మొదటి నుంచి వినిపిస్తోంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ ఇదే నిబంధనతో విజయారెడ్డికి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈసారి పీజేఆర్‌ వారసులుగా ఇద్దరికి అవకాశం లభిస్తుందా ? లేదా ? అన్నది వేచిచూడాలి. విష్ణువర్ధన్‌రెడ్డి టికెట్‌ తనకే అంటూ ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని వ్యతిరేకవర్గాలను తనవైపు తిప్పుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయనకు టికెట్‌ ఇస్తే విజయారెడ్డి పరిస్థితి ఏమిటి ? అని పీజేఆర్‌ వర్గీయుల్లో నెలకొన్నది. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ పక్కపక్క నియోజకవర్గాలు కావడంతో అక్కా, తమ్ముడికి టికెట్లు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి అవకాశం కల్పించాలంటే ఒకరికి స్థానచలనం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా ఆలోచన చేస్తున్నదని సమాచారం.

Updated Date - 2023-08-02T15:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising