ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నన్ను సీతక్క అని పిలిస్తేనే నాకు ఇష్టం

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:50 AM

‘‘నన్ను మేడమ్‌ అని పిలవడం కంటే సీతక్క అని అప్యాయంగా పిలిస్తేనే నాకు ఎంతో ఇష్టం’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

ఆదిలాబాద్‌, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను మేడమ్‌ అని పిలవడం కంటే సీతక్క అని అప్యాయంగా పిలిస్తేనే నాకు ఎంతో ఇష్టం’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం జామ్నిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ స్కీములను పక్కాగా అమలు చేస్తామన్నారు. వాటిలో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగిలిన వాటిని అమలు చేస్తామని ఆమె తెలిపారు. ఇది గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదరికాన్ని తరిమికొట్టాలంటే సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవసరమని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖుష్భుగుప్తా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 06:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising