ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Motkupalli: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నేడు మోత్కుపల్లి దీక్ష

ABN, First Publish Date - 2023-09-24T08:32:11+05:30

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ఉదయం పది గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు (Ex CM Chandrababu) అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి (Motkupalli Narasimhulu) నర్సింహులు ఆదివారం ఉదయం పది గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat) దగ్గర నిరసన దీక్ష (Initiation Protest) చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్‌ (KCR) పనిచేశారు. నేను ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో పనిచేశా.. రాజకీయాలు పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది’’ అని వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లు సీఎంగా, ఎన్డీయే కన్వీనర్‌గా మచ్చలేని నాయకుడిగా ఉన్న బాబుపై జగన్‌ సర్కారు కుట్రపూరితంగా కేసులు పెట్టిందని మండిపడ్డారు.

‘‘ఏపీని జగన్‌ (Jagan) సర్వనాశనం చేశారు. దళితులపై దాడులు, అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోని దౌర్భాగ్య సీఎం జగనే.. దళితుల ప్రాణాలంటే జగన్‌కు లెక్క లేదు. జగన్‌ పాలనలో డాక్టర్‌ సుధాకర్‌ సహా.. కాకికాడ, పులివెందుల, చీరాలలో దళితుల హత్యలు జరిగాయి. ఇప్పటికైనా జగన్‌ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం ఆపకపోతే దళితులంతా తిరగబడతారు’’ అని మోత్కుపల్లి హెచ్చరించారు. జైల్లో చంద్రబాబుకు సరైన భద్రత లేదని అన్నారు. లోకేశ్‌నూ అరెస్టు చేసేందుకు జగన్‌ సర్కారు కుట్ర పన్నుతోందన్నారు. రెండు, మూడ్రోజుల్లో చంద్రబాబును రాజమండ్రి జైల్లో కలుస్తానని.. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. తన హయాంలో లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు ముష్టి రూ.371 కోట్లు స్కాం చేస్తారా..?అని ప్రశ్నించారు. అయినా చంద్రబాబు నెత్తిన పాలు పోశారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారని జోస్యం చెప్పారు. టీడీపీ గెలుపును ఆపలేరని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-24T08:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising