ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana BJP : టీ బీజేపీ సోషల్ వార్.. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ.. ఒక వర్గం సైలెంట్..

ABN, First Publish Date - 2023-07-05T10:06:01+05:30

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి మరీ సోషల్ వార్ నిర్వహిస్తోంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా వార్‌ జరుపుతున్నాయి. మూడో వర్గం మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి మరీ సోషల్ వార్ నిర్వహిస్తోంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా వార్‌ జరుపుతున్నాయి. మూడో వర్గం మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి రావటంతో.. సోషల్ మీడియాలో ఈటల వర్గం సంబరాలు చేసుకుంటోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం మాత్రం సైలెంట్‌గా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్‌రెడ్డి గారికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని బండి సంజయ్ తెలిపారు.

Updated Date - 2023-07-05T10:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising