ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weather Report: తెలంగాణకు నైరుతి రుతుపవనాలు ఎప్పుడొస్తాయో చెప్పిన వాతావరణ శాఖ..

ABN, First Publish Date - 2023-06-07T15:51:09+05:30

రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు ఎప్పుఎప్పుడొస్తాయా అని వేచిచూస్తుండగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్రానికి రుతుపవనాలు మరింత ఆలస్యంగా చేరుకోనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే.. వర్షాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. జూన్ నెల మొదలై ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నప్పటికీ నైరుతీరుతపనాల జాడ కానరాలేదు. రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు ఎప్పుఎప్పుడొస్తాయా అని వేచిచూస్తుండగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్రానికి రుతుపవనాలు మరింత ఆలస్యంగా చేరుకోనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని... రానున్న 48 గంటల్లో కేరళ తీరానికి తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నాయి. రెండు రోజులు రాష్ట్రమంతటా 40°C నుంచి 45°C మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు కూడా ఉంది వీచే అవకాశం ఉంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీచగా.. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్ జిల్లాల్లో వడగాలులు రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-06-07T15:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising