ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Motkupalli: మాజీ మంత్రి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-09-24T12:17:21+05:30

చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఇక ఎదురుండదని జగన్ భావిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తాను త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానని అన్నారు.

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు (Arrest)కు నిరసనగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీమంత్రి (Ex Minister) మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat)లో దీక్ష (Protest) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని అన్నారు. తాను త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానని అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని, నాలుగు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సిందేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. 2019లో తాను జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి పొరపాటు చేశానన్నారు. అప్పట్లో జగన్‌కు మద్దతు ఇచ్చినందుకు తల దించుకుంటున్నానని అన్నారు. ఎవర్ని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని, సీఎం‌ జగన్‌కు నారా భువనేశ్వరి ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం దుర్మార్గమన్నారు. సీఎం పదవి శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు.

నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయాలనుకోచటం అన్యాయమని, ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటం లేదని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్‌కే నష్టమని, జగన్ మళ్ళీ గెలిస్తే.‌. ఆంధ్రప్రదేశ్ రావణకాష్టం కావటం ఖాయమన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు.. నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. తల్లి, చెల్లిని ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్‌దని విమర్శించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపారని, సొంత బాబాయ్‌ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ కపట ప్రేమను దేవుడు కూడా క్షమించడని, జగన్ పాలనలో ఏపీలో దళితలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మోత్కుపల్లి నరసింహులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2023-09-24T12:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising