KCR: బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్..
ABN, First Publish Date - 2023-12-08T08:24:13+05:30
మాజీ సీఎం కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. బాత్రూంలో గత రాత్రి ఆయన కాలు జారి పడిపోడంతో ఆయనకు గాయమైంది. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. బాత్రూంలో గత రాత్రి ఆయన కాలు జారి పడిపోడంతో ఆయనకు గాయమైంది. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది..
Updated Date - 2023-12-08T08:28:40+05:30 IST