ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జోరా పబ్‌ నిర్వాహకుడిపై పోలీసుల యాక్షన్

ABN, First Publish Date - 2023-05-30T14:26:29+05:30

కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణులను పబ్‌లోకి తీసుకొచ్చిన జోరా పబ్ నిర్వాహకుడు వినయ్‌రెడ్డిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణులను పబ్‌లోకి తీసుకొచ్చిన జోరా పబ్ నిర్వాహకుడు వినయ్‌రెడ్డిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు.. ఆపై అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు కేబీఆర్ ఉద్యానవనానికి అటవీ అధికారులు తరలించారు. ఎక్సోటిక్ అనిమల్స్ పెంచడానికి లైసెన్స్‌తో పాటు ఎగ్జిబిషన్ చేయటానికి కూడా అనుమతి తప్పనిసరి. అనుమతులు లేని పక్షంలో పబ్‌పై చర్యలు తీసుకోనున్నారు. సైదాబాద్‌లోని ఎక్సోటిక్ అనిమల్స్ పెట్ షాప్‌పై కూడా అటవీ అధికారులు రైడ్ చేశారు.

కాగా... కస్టమర్లను ఆకర్షించేందుకు జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌‌లో నిర్వాహకులు ఏకంగా జంతు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కస్టమర్ల కోసమే ఇదంతా చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు ఏకంగా జంతువులను ప్రదర్శనకు పెడుతుండటంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు. ఇటువంటి చర్యలు సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశారు. డీజీపీ, సీపీ హైదరాబాద్‌ దృష్టికి తీసుకెళ్తా అంటూ అరవింద్ కుమార్ ట్విట్ చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు.

Updated Date - 2023-05-30T14:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising