Govt Maternity Hospital: వైద్యుల కొరతతో శిశువులకు అందని సేవలు
ABN, First Publish Date - 2023-01-31T11:47:42+05:30
నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రు ల్లో నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు
హైదరాబాద్ సిటీ: నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రు ల్లో(Govt Maternity Hospital) నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు (Doctors) లేరు. దీంతో చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నగరంలో నాలుగు పెద్దాసుపత్రులు, అయిదు ఏరియా మెటర్నిటీ( Maternity), మరో ఆరు ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో రెండు పెద్దాస్పత్రులు మినహా ఇతర వాటిల్లో వైద్యుల కొరత ఉంది. ప్రసూతి ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందించడానికి పిల్లల విభాగం కూడా ఆయా ఆస్పత్రుల్లో లేదు. పుట్టిన శిశువుల్లో కనీసం సగం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. ఇటువంటి వారికి సకాలంలో వైద్యసేవలు అందించకుంటే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది.
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి(Petlaburuju Maternity Hospital)లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వీరు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత అత్యవసర కేసులు వస్తే నిలోఫర్, గాంధీకి వెళ్లాల్సి వస్తుంది. ఇతర ప్రసూతి ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులను నిలోఫర్‌కు పంపిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రుల్లో అర్ధరాత్రి సమయంలో జన్మించే పిల్లలకు వైద్యం దొరకడం కష్టంగా మారింది. ఆ సమయంలో వారిని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సరైన సదుపాయాలు కూడా లేవు. ఏదైనా అయితే దేవుడి మీద భారం వేసి తల్లిదండ్రులు జాగరణ చేయాల్సి వస్తోంది.
Updated Date - 2023-01-31T11:49:45+05:30 IST