ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabaed: మరమ్మతుల చేస్తుండగా కుప్పకూలిన భవనం

ABN, First Publish Date - 2023-03-31T09:15:59+05:30

సెకన్లలో ఓ భవనం కుప్ప కూలిపోయింది. పక్కనున్న మూడిళ్ల గోడలు బీటలు వారాయి. అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): సెకన్లలో ఓ భవనం కుప్ప కూలిపోయింది. పక్కనున్న మూడిళ్ల గోడలు బీటలు వారాయి. అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుత్బుల్లాపూర్‌(Quthbullapur) డివిజన్‌ చెరుకుపల్లి కాలనీలో-1లో 30ఏళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని వెంకట్రామిరెడ్డి నుంచి ఎం.శివకుమార్‌ 15 రోజుల క్రితం కొనుగోలు చేశాడు. ఐదురోజుల నుంచి మరమ్మతులు చేస్తున్నారు. చెదపట్టిన గుమ్మాలు, తలుపులు, కిటికీలను గురువారం కార్మికులు మార్చే పనులు చేస్తున్నారు. గుమ్మాలను తొలగిస్తుండగా గోడలు బీటలు వారాయి.

ప్రమాదాన్ని గుర్తించిన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. కాసేపటికే భవనం కూలిపోయింది. పక్కనున్న ఇళ్లపై భవన శిథిలాలు పడడంతో గోడలు బీటలు వారాయి. భయంతో అందులో నివసిస్తున్న వారు ఖాళీ చేశారు. కూలిన భవనానికి మరో పక్కనున్న అపార్ట్‌మెంట్‌ ప్రహరీ కూలిపోయి నీటిబోరు, జనరేటర్‌పై పడింది. కూలిపోయిన భవనానికి వెనుక ఇంట్లో నివసిస్తున్న సోనాబాయి(40), మరో యువకుడు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Updated Date - 2023-03-31T09:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising