TS Government : విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-07-21T09:43:59+05:30
తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిన్న రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిన్న రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు వణికిస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఈ మేరకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో, రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గురు, శుక్ర వారాలతో పాటు శనివారం కూడా సెలవుగా ప్రకటించటంతో.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సోమవారమే తెరుచుకోనున్నాయి.
Updated Date - 2023-07-21T09:43:59+05:30 IST