TS News: మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2023-12-11T07:08:52+05:30
మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు
హైదరాబాద్ : మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడింది. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పరిశ్రమ నడుపుతోంది. పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నాలుగు గంటలు శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.
Updated Date - 2023-12-11T07:08:54+05:30 IST