ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: రెండవ రోజు సుకేష్ గుప్తాను విచారిస్తున్న ఈడీ...

ABN, First Publish Date - 2023-02-23T11:54:54+05:30

హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ (MBS Jewellers) యజమాని సుఖేశ్‌ గుప్తా (Sukhesh Gupta)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రెండో రోజు గురువారం విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ (MBS Jewellers) యజమాని సుఖేశ్‌ గుప్తా (Sukhesh Gupta)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రెండో రోజు గురువారం విచారిస్తున్నారు. బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి సుఖేష్ గుప్తా మరోసారి విచారణకు హాజరయ్యారు. ఎంఎంటీసీ (MMTC)ని మోసం చేసిన కేసులో ఎంబీఎస్ జ్యువెలర్స్‌పై మనీ లాండరింగ్ (Money Laundering) కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దాదాపు 200 కోట్ల రూపాయలు మోసం చేశారని సుఖేష్ గుప్తపై ఎంఎంటీసీ ఫిర్యాదు చేసింది. అయితే తనపై దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ సుఖేష్ గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. మోసానికి పాల్పడిన వైనంపై పలు వివరాలు సేకరించాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో సుఖేష్ గుప్తా ఈడీ విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈడీ విచారణకు రెండవ రోజు గురువారం సుఖేష్ గుప్తా హాజరయ్యారు.

హైకోర్టు ఆదేశాలతో బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు సుఖేశ్‌ గుప్తా హాజరయ్యారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో ఎంఓయూ కుదుర్చుకున్న లావాదేవీలపై ఈడీ అధికారులు సుఖేశ్‌ గుప్తాను ప్రశ్నించినట్టుగా సమాచారం. అలాగే అతడి బ్యాంకు ఖాతాలను కూడ అధికారులు తనిఖీ చేసినట్టుగా తెలియవచ్చింది. ఈరోజు మరోసారి విచారిస్తున్నారు.

Updated Date - 2023-02-23T13:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising