ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallu Ravi: ఈ విషయంలో తెలంగాణ సమాజం చాలా ఆందోళనలో ఉంది..

ABN, First Publish Date - 2023-03-31T14:00:45+05:30

హైదారాబాద్: రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak) విషయంలో చాలా నిర్లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదారాబాద్: రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak) విషయంలో చాలా నిర్లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) విమర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయలపై ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం (Telangana Society) చాలా ఆందోళనలో ఉందని.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరపున ఇప్పటికే పోరాటాన్ని ఉదృతం చేశామని చెప్పారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, విస్తరించేందుకు టీపీసీసీ (TPCC) ఒక ఉద్యమ కార్యాచరణ కమిటీ వేసిందని, కమిటీ సమావేశం ఈ రోజు జరిగిందన్నారు. కమిటీ ఆధ్వర్యంలో వరుస ఉద్యమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

సిట్ (SIT) విచారణ జరగక ముందే మంత్రి కేటీఆర్ (KTR).. ఇద్దరి వల్లనే ఈ పేపర్ లీక్ జరిగిందని చెప్పడం సిట్‌పై ప్రభావం చూపడమేనని మల్లు రవి అన్నారు. అందుకే సిబిఐ (CBI), సిట్టింగ్ జడ్జి (Sitting Judge) చేత విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని... గవర్నర్, రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. అందుకోసం బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలను మినహాయించి అన్ని పార్టీలు, యువజన, విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేసి న్యాయం జరిగే విధంగా చేస్తామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు.

బలమూరి వెంకట్ (Balamuri Venkat) మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం చాలా అక్రమాలతో కూడుకున్నదని, ఇప్పటికే ఈ అంశంలో కాంగ్రెస్ వీధి పోరాటాలు, రాజకీయ ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేయడం జరుగుతోందన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి (Shiva Sena Reddy) మాట్లాడుతూ.. 30 లక్షల మంది యువతకు సంబంధించిన ఈ పేపర్ లీక్‌ల విషయంలో ప్రభుత్వ వైఖరి చాలా నిర్లక్ష్యంగా, అసహనంగా ఉందని విమర్శించారు. సిట్ విచారణలో ఎలాంటి న్యాయం జరగదని.. ఏ విషయంలో సీబీఐ, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరపాలని, చైర్మన్ జనార్దన్ రెడ్డిని ముందుగా సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారం బయటకు వచ్చి నెలరోజులు అవుతున్న ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని శివసేనారెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-03-31T14:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising