ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: ప్రభుత్వ శ్వేత పత్రాలకు కౌంటర్‌గా నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం..

ABN, Publish Date - Dec 23 , 2023 | 07:59 AM

తెలంగాణ సమావేశాలు మాంచి జోరుగా రసవత్తరంగా సాగుతున్నాయి. రెండు రోజులుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ఈ రోజు ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ సమావేశాలు మాంచి జోరుగా రసవత్తరంగా సాగుతున్నాయి. రెండు రోజులుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ఈ రోజు ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయమని బీఆర్ఎస్ అంటోంది.

పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమంటూ ఫైర్ అవుతోంది. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తామని కేటీఆర్ చెబుతున్నారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించడానికే స్వేద పత్రం విడుదల, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని బీఆర్ఎస్ చెబుతోంది.

Updated Date - Dec 23 , 2023 | 09:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising