ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి

ABN, First Publish Date - 2023-01-23T12:56:12+05:30

జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bandi Sanjay : జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్న‌ారు. జీవో 317తో ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో ఐఏఎస్ అధికారికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేయకుంటే తాను సీఎం అయ్యేవాడిని కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి బయటకు గుంజుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ బాధితులమేనని గుర్తుంచుకోవాలన్నారు. సాటి ఉద్యోగుల పట్ల పోలీసుల తీరు బాధాకరమని.. జీవో 317పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

Updated Date - 2023-01-23T12:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising