ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narsingh Road Accident: నార్సింగి రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

ABN, First Publish Date - 2023-05-20T09:37:27+05:30

నార్సింగ్ విషాద ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నార్సింగ్ విషాద ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డాడు. కారు నడిపిన ప్రసాద్ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి కిత్రమే మృతి చెందాడు. దీంతో ఈ ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో హర్షిత, అంకిత, నితిన్, అమృత్, ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఉదయం నిజాంపేట్‌కు చెందిన విద్యార్థులు కారులో ఓషన్‌పార్క్ వెళ్తుండగా నార్సింగ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓవర్ టేక్‌ చేయబోయి లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. డ్రైవింగ్ చేసిన ప్రసాద్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈరోజు ఉదయం ప్రసాద్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. నితిన్, హర్షిత, అంకిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత సొంత అక్కా చెల్లెళ్లు. అమృత్ అనే యువకుడు నిన్న చనిపోగా.. ప్రసాద్ ఈరోజు కన్నుమూశాడు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెహదీపట్నం ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-05-20T09:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising