ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: బీఆర్‌ఎస్‏కు ఫిలించాంబర్‌ మద్దతు

ABN, First Publish Date - 2023-11-17T13:34:15+05:30

బీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నట్లు ఫిలించాంబర్‌ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్‌(President Ramakrishna Goud) ఒక ప్రకటనలో

హైదరాబాద్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నట్లు ఫిలించాంబర్‌ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్‌(President Ramakrishna Goud) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లుగా చిత్ర పరిశ్రమకు సహాయ సహకారాలు అందిస్తున్నందున..సినీ కార్మికులందరూ ఈనెల 30న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతునిస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. టికెట్‌ రేట్లు, స్పెషల్‌షో, షూటింగ్‌ లొకేషన్‌కు అనుమతులు..ఇలా చిత్రపరిశ్రమకు ఏ అవసరం ఉన్నా.. ప్రభుత్వం తరఫున మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, పద్మారావుగౌడ్‌, ప్రకాష్ గౌడ్‌ తదితరులు వెంటనే స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో నటుడు సత్యప్రకాష్‌, నిర్మాతలు గురురాజ్‌, సాగర్‌, కాచం సత్యనారాయణ, రమేష్‌ నాయుడు, ఈవీఎం చారి, డైరెక్టర్లు బందూక్‌ లక్ష్మణ్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-17T13:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising