‘సేవాదళ్’కు వందేళ్లు
ABN, Publish Date - Dec 29 , 2023 | 03:49 AM
‘సేవాదళ్’ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో ఉత్సవాలు నిర్వహించారు.
గాంధీభవన్‌లో ఉత్సవాలు నిర్వహించిన నాయకులు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘సేవాదళ్’ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఫిషరీ సెల్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొన్నారు. వీరంతా నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మహేష్ కుమార్ గౌడ్ 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కృషి మరువ లేనిదని కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వక్తలు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ స్థానాలు సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Updated Date - Dec 29 , 2023 | 07:01 AM