ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డబ్బులిస్తానని పిలిచి చంపేశాడు

ABN, First Publish Date - 2023-12-11T00:24:06+05:30

: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.

నిందితుడికి రిమాండ్‌

తిప్పర్తి, డిసెంబరు 10: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివా రం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెంది న వల్లందాసు మంజుల (34) అనే మహిళకు 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకు ఒక బాబు జన్మించిన తర్వాత భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో ఆమె భర్తకు దూరమై కుమారుడిని తీసుకొని తల్లిదండ్రుల వద్ద వెలుగుపల్లి గ్రామంలో ఉండేది. గతేడాది నల్లగొండ పట్టణంలోని ఓ వ్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఈ నేపథ్యంలో ఆమె కు నల్లగొండ పట్టణంలోని హైదర్‌ఖాన్‌గూడకు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ వాజీద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇరువురు ఆరు నెలల క్రితం నల్లగొం డ పట్టణంలో ఒక గది అద్దెకు తీసుకొని కలిసి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తె మంజులను వెలుగుపల్లి తీసుకెళా ్లరు. కొన్ని నెలలు ఖాళీగా ఇంటి వద్దే ఉన్న ఆమె రెండు నెలల క్రితం నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వంట పనిలో వర్కర్‌గా చేరింది. విషయం తెలిసిన వాజీద్‌ మళ్లీ ఫోన్‌ చేయడం ప్రారంభించాడు. ఆమె వాజీద్‌ ఫోన్‌ ఎత్తడం లేదు. దీంతో నిందితుడు వాజీద్‌ ఆమెపై కోపం పెంచుకున్నాడు. వరుసగా ఫోన్‌ చేస్తుండడంతో ఈ నెల 6వ తేదీన ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన మంజుల తనకు ఆరోగ్య సమస్య ఉందని, దానికి కావాల్సిన డబు ్బలు ఇవ్వాలని కోరింది. దీంతో నీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాజీద్‌ 6వ తేదీ సాయంత్రం ఆమెను ఆటోలో ఎక్కించుకొని మిర్యాలగూడెం రోడ్డులోని అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ సమీపంలో బసిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే దారికి తీసుకెళ్లాడు. ఆటోలో తన ఫోన్‌ ఎందుకు ఎత్తలేదంటూ వాజీద్‌ మంజులను రాత్రి 8గంటల సమయంలో నిలదీశాడు. దానికి ఆమె సమాధానంగా నా విషయాలు నీకెందుకు అనడంతో కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో వాజీద్‌ ఆటోలోని జాకీ రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో మంజుల కింద పడిపోయింది. అనంతరం పక్కన ఉన్న చున్నీతో మెడకు బిగించి రాళ్లతో కొట్టి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు వాజీద్‌ను ఆదివా రం ఉదయం నల్లగొండలోని గుండ్లపల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించట్లు తెలిపారు. మంజులను తీసుకెళ్లిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వాజీద్‌పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌ చేసినట్లు ఎస్‌ఐ ధర్మ తెలిపారు.

Updated Date - 2023-12-11T00:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising