గోల్డ్ ఏటీఎం
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:02 AM
ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసకునే మాదిరిగానే బంగారమూ తీసుకోగలిగితే? హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేసన్‌కు వెళితే మీకు ఆ అవకాశం ఉంటుంది!
అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో ప్రారంభం
ఏర్పాటుచేసిన గోల్డ్ సిక్కా కంపెనీ
బంగారంతో పాటు వెండి కూడా
0.5-20 గ్రాముల వరకు బంగారం..
10 గ్రాముల దాకా వెండి నాణేలు
డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు
యూపీఐ చెల్లింపులకూ అనుమతి
అమీర్‌పేట, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసకునే మాదిరిగానే బంగారమూ తీసుకోగలిగితే? హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేసన్‌కు వెళితే మీకు ఆ అవకాశం ఉంటుంది! ఈ ‘బంగారు ఏటీఎం’ను గోల్డ్ సిక్కా కంపెనీ ఏర్పాటు చేసింది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కంపెనీ ప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏటీఎం ద్వారా గోల్డ్ కాయిన్స్‌తో పాటు సిల్వర్ కాయిన్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి.. 0.5 గ్రాము నుంచి 20 గ్రామల దాకా బంగారు సిక్కలను, 0.5 గ్రాము నుంచి 10 గ్రాముల దాకా వెండి సిక్కలను కొనొచ్చు. ఏటీఎంలో నిర్దేశిత లావాదేవీలు పూర్తవగానే ఎంచుకున్న కాయిన్స్ బయటకు వస్తాయి. కొనుగోలుకు డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపులనూ అనుమతిస్తారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలనే తీసుకుంటారు. ఆ ధరలు ఏటీఎం మానిటర్‌పైన ఎప్పటికప్పుడు డిస్‌ప్లే అవుతుంటాయి. త్వరలో తాము దేశ వ్యాప్తంగా, విదేశాల్లోనూ 2వేల నుంచి 3వేల దాకా గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా కంపెనీ సీఈవో తరుణ్ పేర్కొన్నారు. వైజాగ్‌లోనూ గోల్డ్ ఏటీఎం కోసం ఓ సంస్థతో ఒప్పందం జరిగిందని వెల్లడించారు.
Updated Date - Dec 30 , 2023 | 03:02 AM