ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వంటింట్లో ధరల మంట..!

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:56 PM

నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయి. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు వాటిని బ్లాక్‌ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ప్రధానంగా బియ్యం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ధాన్యం దిగుబడులు భారీగా పెరిగినా బియ్యం ధరలు ఆకాశన్నంటడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పప్పుల ధరలు కూడా అందనంత దూరానికి చేరాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

నింగినంటిన నిత్యావసరాలు

ఆకాశానికి చేరిన బియ్యం రేటు

అందనంత దూరంలో కందిపప్పు

చుక్కల పక్కన చేరిన జొన్నలు

ఊరటనిచ్చిన ఉల్లిగడ్డ

పేద, మధ్య తరగతి వారికి భారంగా మారిన ధరలు

======================

నిత్యావసర వస్తువుల ధరలు (రూపాయల్లో)

వస్తువు 2022 2023

డిసెంబర్‌ డిసెంబరు

బియ్యం 44 65

కందిపప్పు 106 180

మినపప్పు 115 160

పెసరపప్పు 105 130

ఉల్లిగడ్డలు 28 30

-----------------------------------------------------

నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయి. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు వాటిని బ్లాక్‌ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ప్రధానంగా బియ్యం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ధాన్యం దిగుబడులు భారీగా పెరిగినా బియ్యం ధరలు ఆకాశన్నంటడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పప్పుల ధరలు కూడా అందనంత దూరానికి చేరాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 22 : నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు ఏం కొనాలన్న కష్టంగా మారింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయడంతో విఫలమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయిరఫ. ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి వారికి భారంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి పప్పులు, బియ్యం ధరలు పైపైకి ఎగబాకాయి. కందిపప్పు ధర కుతకుతమంటోంది. బియ్యం ధరలు కాశానికి నిచ్చెన వేశాయి. జొన్నరొట్టెలు తినేవారికి జొన్నలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. తెల్లజొన్నలు, పచ్చజొన్నల ధరలు భగ్గుమంటున్నాయి. బియ్యం, పప్పుల ధరలు పక్కన పెడితే.. కోయకుండానే కంట్లో నీరు తెప్పించిన ఉల్లిగడ్డ రేటు కాస్త దిగి రావడం సామాన్యులకు కొంత ఊరటనిచ్చింది. మహారాష్ట్ర నుంచి ఉల్లి గడ్డ దిగుమతి అవుతుంది. దీంతో ఉల్లి ధర కాస్త తగ్గింది. వారం రోజుల క్రితం కిలో ఉల్లి 60 రూపాయలు విక్రయించగా ప్రస్తుతం 30 రూపాయలకు చేరుకుంది.

ధాన్యం దిగుబడి పెరిగినా..

అంచనాకు మించి ధాన్యం పండినా.. అవసరానికి పదింతల బియ్యం ఉత్పత్తి జరిగినా.. బియ్యం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉన్న బియ్యం లావాదేవీల్లో తలెత్తుతున్న సమన్వయ లోపం ధరల పెరుగుదలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేంద్రం రాష్ట్రాల అవసరాల మేరకు విడుదల చేస్తుంటుంది. ఇటీవల కాలంలో ఉత్పత్తిలో సగానికి పైగా బియ్యాన్ని కేంద్రం విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫలితంగా ఇక్కడ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆ ధరాఘాతం పేద, మధ్యతరగతి వర్గాలను వెంటాడుతోంది. ప్రస్తుత మార్కెట్‌లో వివిధ రకాలకు చెందిన పాత బియ్యం క్వింటాలుకు రూ.6,500 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాలకు రూ.5,500 వరకు విక్రయిస్తున్నారు. గతేడాది పాత బియ్యం ధర రూ. 4,300 నుంచి 4,700 వరకు అమ్ముడు పోగా ప్రస్తుతం దీని ధర 1,500కు పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక నిరుపేదలు కడుపునిండా తినలేక పస్తులుండే దుస్థితి తలెత్తింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ధరల పెరుగుదలకు కారణాలు?

బహిరంగ మార్కెట్లో కొరత ఏర్పడుతున్న కారణంగా వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. ప్రజలకు జీవనాధారమైన నిత్యావసర సరుకుల్లో అతి కీలకమైన బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం వాటిపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం, రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడమేనని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్‌ మిల్లర్లంతా సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని వ్యాపారులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

బియ్యాన్ని దాటేసిన జొన్నలు

బియ్యం ధరలు పెరుగుతున్న తరహాలోనే జొన్నల ధరలకు రెక్కలొచ్చాయి. జొన్న సాగు తగ్గుతుండటంతో జొన్నల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తెల్లరకం లోకల్‌ జొన్నలు కిలో 32 రూపాయలు, మహేంద్ర రకం జొన్నలు కిలోకు 38 నుంచి 45 రూపాయలు, సాయి జొన్నలు 65 నుంచి70 రూపాయలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది క్వింటాలు జొన్నలకు 2,500 ఉంటే ప్రస్తుతం 3,200కు విక్రయిస్తున్నారు. అలాగే పచ్చజొన్నలు కిలో 75 రూపాయలకు విక్రయిస్తున్నారు. క్వింటాలు పచ్చ జొన్నలు గత సంవత్సరం రూ.6 వేలు ఉండగా ప్రస్తుతం రూ.7,500 వరకు అమ్ముడుపోతున్నాయి. బియ్యం ధర కంటే జొన్నల ధరలే అధికంగా ఉన్నాయి.

నిప్పులు కురిపిస్తున్న పప్పులు

పప్పుల ధరలు పేట్రేగి పోతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కంది, మినుములు, పెసర పంటలు సాధారణ విస్తీర్ణంలో సాగైనా అకాల వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గడిచిన రెండేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా కంది పప్పు ధర కుతకుతమంటోంది.

వసతి గృహాల్లో ఇబ్బంది..

పప్పుల ధరలు భారీగా పెరగడంతో వసతిగృహాల్లో విద్యార్థులకు పప్పుతో కూడిన కూరలు పెట్టడానికి వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని మెస్‌ చార్జీలతో పప్పులు కొనుగోలు చేయలేకపోతున్నామని వార్డెన్లు అభిప్రాయపడుతున్నారు. 50 మంది విద్యార్థులు ఉండే హాస్టల్‌లో ఒకపూట కూరలో నాలుగు కిలోల వరకు పప్పు వినియోగిస్తే ఇప్పుడు రెండు కిలోలతోనే సరిపెడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వడ్డించే ఆహారంలో తప్పనిసరిగా పప్పు, ఆకుకూరలు ఉండాలి. పెరిగిన ధరల వల్ల పూర్తిగా పప్పు కూర పెట్టలేక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు.

తగ్గుతున్న ఉల్లి ధర

నిన్న మొన్నటి వరకు కోయకుండానే కంట పెట్టించిన ఉల్లి గడ్డ ధర ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండటంతో ధర తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం కిలో ఉల్లిగడ్డ 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 30 రూపాయలకు చేరుకుంది.

----------------

బియ్యం, కంది పప్పు ధర పెరిగింది

నేను 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. ఎన్నడూ ఇంతగా బియ్యం ధర పెరగలేదు. కంది పప్పు ధర కూడా బాగా పెరిగింది. సోనా మసూరి కిలో బియ్యం 55కు విక్రయిస్తున్నాం. పాత బియ్యం 65కు పోతోంది. క్వింటాలు బియ్యంపై గరిష్టంగా రూ.1,500 వరకు పెరిగింది.

- బాల్‌రెడ్డి, కిరాణా వ్యాపారి, చేవెళ్ల

బియ్యం ధరలు చూస్తుంటే భయం వేస్తుంది

రోజు రోజుకు పెరుగుతున్న బియ్యం ధరలు చూస్తుంటే భయం వేస్తుంది. వ్యాపారులందరూ కుమ్మక్కై బియ్యం ధరలను పెంచుతున్నారనిపిస్తుంది. కిలో బియ్యం 65 రూపాయలు పెట్టి కొనాలంటే కష్టమే. ప్రభుత్వాలు బియ్యం ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి.

- బేగరి రాములు, తుమ్మలపల్లి, చౌదరిగూడ మండలం

కూలి డబ్బులు బియ్యానికే పోతున్నాయ్‌

రోజు చేసే కష్టంలో సగం డబ్బులు బియ్యానికే పోతున్నాయి. బియ్యం ధరలు ఇలా ఉంటే ఒక పప్పుతో పాటు సరుకులు, కూరగాయలు ఏం పెట్టి కొనాలి? పిల్లలను ఎలా చదివించుకోవాలి. ఎలా బతకాలి? ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేవు. బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

- భారతమ్మ, ఇంద్రనగర్‌, చౌదరిగూడ మండలం

Updated Date - Dec 23 , 2023 | 12:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising