అగ్ని ప్రమాదాలు తగ్గాయి!
ABN, Publish Date - Dec 31 , 2023 | 04:29 AM
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 9.67 శాతం అగ్ని ప్రమాదాలు తగ్గాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 7,174 అగ్ని ప్రమాదాలు నమోదవగా.. 2
గతేడాదితో పోలిస్తే 9.67ు తగ్గిన ప్రమాదాలు..
వార్షిక నివేదిక విడుదల చేసిన అగ్నిమాపక శాఖ డీజీ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 9.67 శాతం అగ్ని ప్రమాదాలు తగ్గాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 7,174 అగ్ని ప్రమాదాలు నమోదవగా.. 2022లో 7,942 రికార్డయినట్లు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక శాఖ వార్షిక నివేదిక-2023’ను శనివారం ఆయన విడుదల చేశారు. అయితే ఈసారి తీవ్ర అగ్ని ప్రమాదాలు గతేడాది కంటే 3.84 శాతం పెరిగాయి. ఈ ఏడాది మొత్తం 6,549 నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల(ఎన్‌ఓసీ)ను జారీ చేయగా.. పలు రకాల అనుమతుల జారీ ద్వారా శాఖకు రూ.36.66 కోట్ల ఆదాయం సమకూరింది. అగ్ని ప్రమాదాల నియంత్రణ, నివారణపై రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పలు జిల్లాల్లో 19 కొత్త ఫైర్ స్టేషన్లను ప్రారంభించారు. 2022లో జరిగిన అగ్ని ప్రమాదాల నుంచి 934 మంది ప్రాణాలు కాపాడి, రూ.723.14 కోట్ల విలువైన ఆస్తులను రక్షించగా.. 2023లో 2,093 మంది ప్రాణాలు, రూ.918.69 కోట్ల ఆస్తులను కాపాడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 06:54 AM