ఫాసిస్టు మోదీ పాలనకు చరమగీతం పాడాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:45 PM
ఫాసిస్టు నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు ఎం.బాలనరసింహ ప్రజలకు పిలుపుని చ్చారు.
- పేదరికం ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ
పాలమూరు, డిసెంబరు 26 : ఫాసిస్టు నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు ఎం.బాలనరసింహ ప్రజలకు పిలుపుని చ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం దగ్గర పార్టీ 99వ ఆవిర్భావ ది నోత్సవం సందర్భంగా జెండావిష్కరణ చేశారు. అంతకు ముందుకు సీపీఐ శ్రేణులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా సమితి కార్య దర్శి బి.బాలకిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం తో పాటు రూరల్, జిల్లా వ్యాప్తంగా తమ క్యాడర్ ఉన్నచోట సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిం చినట్లు తెలిపారు. సమాజంలో పేదరికం ఉన్నంత వరకు కమ్యూనిస్టులు, కమ్యూనిజం అవసరం ఉం టుందన్నారు. మెజారిటీ ప్రజల హక్కులను దోచు కొని మైనారిటీ జనం సుఖభోగాలను అనుభవిం చడానికి ‘మనుస్మృతి’ ద్వారా దళితులు, మహిళల హక్కులను బీజేపీ హరిస్తోందన్నారు. సమాజంలో కమ్యూనిస్టులు మాత్రమే నిజాయితీగా పనిచేస్తా రని తెలిపారు. విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావటానికి బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ప్రతి పక్షంలో ఉన్నవారు ప్రశ్నించడాన్ని సహించలేక కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసిన ఘనత బీజేపీదన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు స్వామినాథన్ కమి షన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి నేటికీ పట్టింపులేదన్నారు. 2001, 2023లో బీజేపీ అధికా రంలో ఉన్నప్పుడే పార్లమెంటులో దాడిజరగటం బీజేపీ చేస్తున్న పనేనన్నారు. విద్వేషం, సున్నిత మైన అంశాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావట మే బీజేపీ లక్ష్యమన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి బి.ఆర్ విల్సన్, సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, పి.సురేష్, ప్రొఫెసర్ గాలెన్న, ఎన్. శంకర్‌నాయక్, లక్ష్మణ్, సి.రాజు, నరసింహ, చాంద్ బాషా, పవన్‌కుమార్‌రెడ్డి, అమరజ్యోతి, శ్రీను, సత్యనారాయణరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 10:45 PM