ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: శిరీష హత్య ఘటనలో కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ

ABN, First Publish Date - 2023-06-11T20:43:17+05:30

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామం జట్టు శిరీష(19) అనే యువతి దారుణ హత్యకు గురయింది. ఈ కేసు విచారణలో పరిగి డీఎస్పీ కరుణసాగర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామం జట్టు శిరీష(19) అనే యువతి దారుణ హత్యకు గురయింది. ఈ కేసు విచారణలో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ‘‘శిరీష హత్య కోసం నిందితుడు స్క్రూ డ్రైవర్ వాడినట్టు మేం ఎక్కడా చెప్పలేదు. పదునైన ఆయుధంతో కంట్లో పొడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. యువతిపై అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవు. ఇంకా పోస్ట్‌మార్టం పూర్తికాలేదు. యువతి ఫోన్ సీజ్ చేశాం... సాంకేతిక సాక్షాలు సేకరిస్తున్నాం. విచారణ కొనసాగుతోంది.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు’’ అని డీఎస్పీ తెలిపారు.

అసలేం జరిగిందంటే..

శిరీష దుండగుల చేతిలో హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన జట్టు శిరీష(19) వికారాబాద్‌లోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతోంది. శిరీష కళాశాల నుంచి మూడు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లి యాదమ్మకు ఆరోగ్యం బాగాలేక శిరీష అన్న శ్రీకాంత్‌ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శనివారం రాత్రి ఇంటి వద్ద శిరీష, ఆమె తండ్రి జంగయ్య ఇద్దరే ఉన్నారు. రాత్రి పది గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారు మైసమ్మ ఆలయ సమీపంలో శిరీష మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి కళ్లలో కత్తితో పొడిచారు. మెడపైనా కత్తిపోట్లున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిగి డీఎప్పీ కరుణసాగర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. శిరీష ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శిరీష హత్యపై పలు అనుమానాలు

శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శిరీష కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. ఆమెను కాలేజీ మన్పించినట్టు తెలుస్తోంది. హత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? రాత్రి పూట ఆమె బయటకు ఎందుకు వెళ్లింది? బంధువులు ఎవరైనా ఫోన్‌ చేసి బయటకు రమ్మని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-06-11T20:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising