‘ప్రజాపాలన’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Dec 29 , 2023 | 11:16 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు.
- అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్
- దరఖాస్తు స్వీకరణ కేంద్రాల పరిశీలన
నారాయణపేటరూరల్, డిసెంబరు 29: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. శుక్రవారం నా రాయణపేట మండలంలోని జాజాపూర్, తిర్మలాపూర్, కోటకొండ, లింగంపల్లి, పిల్లిగుంట్ల తండా గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జాజాపూర్, కోటకొండ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులను ఎక్కువమొత్తంలో ఉంచాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ రాణాప్రతాప్, ఎంపీడీవో వెంకటయ్య, డీటీ నారాయణ, శరత్‌చంద్ర, ఎంపీవో బాలాజీ పాల్గొన్నారు.
దరఖాస్తుల కొరత లేకుండా చూడాలి
నారాయణపేట టౌన్: ప్రజాపాలన దరఖాస్తుల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ మ యాంక్ మిట్టల్ అన్నారు. నారాయణపేట 6వ వార్డు బీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతు న్న వార్డు సభను శుక్రవారం అదనపు కలెక్టర్ పరిశీ లించారు. కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా దర ఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని కమిష నర్ సునీతకు సూచించారు. వార్డులో రోజు వారిగా వస్తున్న దరఖాస్తు వివరాలను అడిగి తెలుసుకు న్నారు. డెస్క్ సిబ్బంది చదువు రానీ వారికి ఫారాలు నింపి ఇవ్వాలని సూచించారు.
సంక్షేమ పథకాలు అందించేందుకే ..
మక్తల్ : అర్హులైన పేద ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జడ్పీ చైర్ పర్సన్ వనజ అన్నారు. శుక్రవారం మండలం లోని సంగంబండ, కర్ని గ్రామాల్లో ప్రజాపాలన దరఖా స్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకే ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో అఽధి కారులకు దరఖాస్తులు ఇవ్వలేకపోయినవారు మం డల పరిషత్, మునిసిపాలిటీ, తహసీల్దార్ కార్యాల యాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. స మావేశంలో ఎంపీపీ వనజ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, నాగిరె డ్డి, రాజు, బలరాంరెడ్డి, సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 11:16 PM