Damodara Rajanarasimha: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుంది
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:05 PM
ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు.
సంగారెడ్డి: ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందన్నారు. ప్రభుత్వం మీ ముందు వచ్చిందని... మీ దరఖాస్తులు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 01:05 PM