ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీపీఐ(ఎం) నేత వాసుదేవ ఆచార్య కన్నుమూత

ABN, First Publish Date - 2023-11-14T04:07:01+05:30

కార్మిక ఉద్యమ నేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ వాసుదేవ ఆచార్య(81) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కార్మిక ఉద్యమ నేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ వాసుదేవ ఆచార్య(81) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన వాసుదేవ ఆచార్య అక్కడి బంకూరా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీ ఉన్నప్పుడు పలు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో పలు హోదాల్లో వాసుదేవ పని చేశారు. సీపీఎం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేశారు. ఆయన భార్య ఇదివరకే మరణించారు. వాసుదేవ తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వాసుదేవ మృతిపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. వాసుదేవ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబసభ్యులు, మిత్రులకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎక్స్‌(ట్విటర్‌)లో సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించనున్నారు.

Updated Date - 2023-11-14T04:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising