ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీపీఐ నాయకుడు పశ్య వెంకటరెడ్డి మృతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:44 PM

హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన సీపీఐ నాయకుడు, రైస్‌మిల్లర్‌ పశ్య వెంకటరెడ్డి(55) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.

పశ్య వెంకటరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు

హుజూర్‌నగర్‌, డిసెంబరు 26: హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన సీపీఐ నాయకుడు, రైస్‌మిల్లర్‌ పశ్య వెంకటరెడ్డి(55) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారైలు ఉన్నారు. వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఎం. వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ అన్నారు. వెంకటరెడ్డి భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నమ్మిన సిద్దాంతాల కోసం కడవరకు పోరాడిన గొప్ప నాయకుడన్నారు. ఒక పక్క సీపీఐ నాయకుడిగా, మరోవైపు ఆధ్యాత్మికవేతగా, రైస్‌మిల్లర్‌గా ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. అశ్రునయనాల మధ్య వెంకటరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సీపీఐ రాష్ట్ర నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్‌, దేవరం మల్లేశ్వరి, మేకల శ్రీను, జడ శ్రీనివాస్‌, ములక్కలపల్లి సీతయ్య, తన్నీరు మల్లిఖార్జున్‌రావు, అంజిరెడ్డి, నాగారపుపాండు, అజీజ్‌పాషా, గొట్టె రామయ్య, సాముల రాంరెడ్డి, అనంతు లక్ష్మీ, మల్లేశ్వరి, రమేష్‌, వెంకటేశ్వర్లు, యరగాని నాగన్నగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising