కురుమూర్తిస్వామి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:20 PM
మండలంలోని అమ్మాపురం గ్రామ శివారులో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం కలెక్టర్ రవినాయక్ దంపతులు దర్శించుకున్నారు.
చిన్నచింతకుంట/ మహబూబ్‌నగర్ రూరల్, డిసెంబరు 17 : మండలంలోని అమ్మాపురం గ్రామ శివారులో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం కలెక్టర్ రవినాయక్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు శాలువాలతో సత్కరించారు. అనంతరం వారిని ఆశీర్వదించారు. మన్యంకొండ లోనూ వేంకటేశ్వరస్వామిని ఆదివారం కలెక్టర్ జి. రవినాయక్ దంపతులు దర్శించుకు న్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్ వారికి హనుమద్దాసు మండపంలో స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అలహరి రామకృష్ణ, అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:20 PM