ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2023-04-12T22:51:34+05:30

ముస్లింలకు (Muslims) తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీర్వాదంతో దేశంలో వెలుగు ఉందని, అల్లా ఆశీర్వాదంతో BRS జాతీయస్థాయిలో ఎదగబోతోందని కేసీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ముస్లింలకు (Muslims) తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీర్వాదంతో దేశంలో వెలుగు ఉందని, అల్లా ఆశీర్వాదంతో BRS జాతీయస్థాయిలో ఎదగబోతోందని కేసీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తెలివితో వ్యవహరిస్తే సక్సెస్ అదే వస్తుందని, కాంగ్రెస్ హయాంలో మైనార్టీలను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక రూ.12 వేల కోట్లు నిధులు కేటాయించామని సీఎం వెల్లడించారు. దేశ తలసరి ఆదాయంలో తెలంగాణది ప్రథమ స్థానమని, 56 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు.

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లింలతో కలిసి సామూహిక భోజనం చేశారు. అనంతరం జిల్లా వక్ఫ్‌బోర్డు సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డిని గజమాలతో సత్కరించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలోనే ప్రజా సంక్షేమం సాధ్యం అన్నారు. అందరికి సమప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చేయూత ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు పోతుల మదుసూదన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-04-12T22:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising