మహాలక్ష్మి జీరో టికెట్లపై తనిఖీలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:41 AM
మహాలక్ష్మి జీరో టికెట్లపై జారీ టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక దృష్టిసారించింది. పలు ప్రాంతాల్లో మహిళా ప్రయాణికులకంటే ఎక్కువ సంఖ్యలో జీరో టికెట్లు జారీ
తప్పుడు లెక్కలు చూపితే కఠినచర్యలు: అధికారులు
ఉచిత ప్రయాణంతో 88% పెరిగిన ఆక్యుపెన్సీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి జీరో టికెట్లపై జారీ టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక దృష్టిసారించింది. పలు ప్రాంతాల్లో మహిళా ప్రయాణికులకంటే ఎక్కువ సంఖ్యలో జీరో టికెట్లు జారీ అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తడం.. కండక్టర్లు జీరో టికెట్లను వరుసపెట్టి జనరేట్ చేస్తున్న కొన్ని దృశ్యాలు నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణాలకు ముందు ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 6 లక్షలుగా ఉండేది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక.. ఆ సంఖ్య 8 లక్షలకు చేరింది. ఆక్యుపెన్సీ రేషియో 69ు నుంచి 88శాతానికి పెరిగింది. కొన్ని డిపోల్లో అయితే.. ఏకంగా ఆక్యుపెన్సీ రేషియో 100శాతాన్ని దాటిపోయింది. కండక్టర్ల పనితీరును అంచనా వేయడంలో ఎర్న్ పర్ కిలోమీటర్(ఈపీకే) అత్యంత కీలకం. దీని ఆధారంగానే కండక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయి. ఈపీకే కోసమే కండక్టర్లు మహిళా ప్రయాణికులు లేకున్నా.. ఎక్కువ మొత్తంలో జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో.. టీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. టికెట్ల జారీపై ఎక్కడ తప్పులు జరిగినా.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన ప్రాంతాల్లో ట్రిప్పులను పెంచడంతోపాటు.. రాత్రి వరకు అదనపు బస్సులను నడపాలని ఇప్పటికే రీజినల్ మేనేజర్లకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కండక్టర్లు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే.. 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:41 AM