ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:27 PM

కేంద్ర ప్రభుత్వనం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య అన్నారు.

చిట్యాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు

చిట్యాల / శాలిగౌరారం, డిసెంబరు 22 : కేంద్ర ప్రభుత్వనం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య అన్నారు. శుక్రవారం చిట్యాలలో పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించిన ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను పార్లమెంటు లోపల, బయట బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. వైషమ్యాలను రెచ్చగొట్టడం బీజేపీ మాని ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అరూరి శ్రీను, జిట్ట సరోజ, బొబ్బల సుధాకర్‌రెడ్డి, గుడిసె లక్ష్మినారయణ, కల్లూరి కుమారస్వామి, మేడి సుగణమ్మ పాల్గొన్నారు. శాలిగౌరారం మండల ఉట్కూరులో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌లో జరిగిన దాడిపై చర్చకు విపక్షాలకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షాలను చర్చలకు రానివ్వకుండా అడ్డుపడటం కేంద్రానికి తగదన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising