రైతులపై కేసులు ఎత్తేయాలి: ఎస్‌కేఎం
ABN, First Publish Date - 2023-12-11T04:05:46+05:30
సాగు చట్టాల రద్దు కోసం పోరాడిన రైతులపై మోపిన కేసులను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే ఈనెల 11, 12, 13 తేదీల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు పంపాలని నిర్ణయించింది.
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సాగు చట్టాల రద్దు కోసం పోరాడిన రైతులపై మోపిన కేసులను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే ఈనెల 11, 12, 13 తేదీల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు పంపాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు పశ్యపద్మ, సాగర్, జక్కుల వెంకటయ్య, వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు వ్యతిరేక మూడు సాగు చట్టాల రద్దు, మద్దతు ధర గ్యారెంటీ చట్టం తదితర డిమాండ్లతో 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమ సమయంలో 730 మంది రైతులు చనిపోయారని, వేలాది మంది రైతులపై అక్రమ కేసులు మోపారని మండిపడ్డారు.
Updated Date - 2023-12-11T07:22:22+05:30 IST