ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ నేతలు జైలుకెళ్లడం ఖాయం

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:24 AM

బీఆర్‌ఎస్‌ పార్టీలో అవినీతికి పాల్పడిన నాయకులు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇకపై ఉండదని,

త్వరలో ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుంది

రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ దివాలా తీయించింది

మరో 20 ఏళ్లు కాంగ్రె్‌సదే అధికారం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీలో అవినీతికి పాల్పడిన నాయకులు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇకపై ఉండదని, నాలుగు ముక్కలవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిపై వేసిన సిటింగ్‌ జడ్జి విచారణ నివేదిక రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 01:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising