ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సృజనాత్మకతను వెలికి తీయాలి

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:17 PM

విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని డీఈవో అబ్దుల్‌ ఘని అన్నారు.

ప్రదర్శనలను తిలకిస్తున్న డీఈవో అబ్దుల్‌ ఘని, ఉపాధ్యాయులు

- డీఈవో అబ్దుల్‌ ఘని

- శ్రీసాయి పాఠశాలలో ఎక్స్‌ఫో

నారాయణపేట, డిసెంబరు 22: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని డీఈవో అబ్దుల్‌ ఘని అన్నారు. సూపర్‌ మైండ్స్‌ ఎక్స్‌ఫో కార్యక్రమంలో భాగంగా నారాయణపేట శ్రీసాయి స్కూల్‌లో శుక్రవారం వివిధ సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల న మూనాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో అబ్దుల్‌ ఘని హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నమూనాలను పరిశీలించి అభినందించారు. సూపర్‌ మైండ్స్‌ ఎక్స్‌ఫో వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి నాగార్జున్‌, నిర్వహకులు శేషమ్మ, గోవర్ధన్‌, సురేం దర్‌నాథ్‌, మురళీధర్‌, సాయిలీల, ఉపాధ్యాయులు బాలప్ప, భగవంత్‌, నర్సిం హ, అమీనా, సునీల్‌, సురేందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యం

నారాయణపేటరూరల్‌ : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణతోనే జీవకోటి మనుగడ సాధ్యమౌతుందని జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్‌ ఘని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శుక్రవారం పేట మండలంలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్ర నేషనల్‌ కోర్‌ లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సందేశంలో రూపొందించిన బట్ట సంచులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అందరూ బట్టల సంచులను వాడి ప్లాస్టిక్‌ను నియంత్రించాలన్నారు. త్వరలో జిల్లాలో ఎంపిక చేసిన గ్రీన్‌ కోర్‌ పర్యావరణ క్లబ్బులకు, ఉన్నత పాఠశాలలకు బట్టల సంచులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కన్కప్ప, ఎన్జీసీ కోఆర్డినేటర్‌ భానుప్రకాశ్‌, రమేశ్‌శెట్టి, బాలకిష్టప్ప పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising