ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రులను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-12-11T03:13:44+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం జిల్లాకు చెందిన మంత్రులను కలిశారు.

భట్టి, తుమ్మల, పొంగులేటికి తెల్లం వెంకట్రావు సత్కారం

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

బూర్గంపాడు, డిసెంబరు 10: ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం జిల్లాకు చెందిన మంత్రులను కలిశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లగా.. సారపాక ఐటీసీ గెస్ట్‌హౌ్‌సలో వెంకట్రావు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలవడం, ఆయన మంత్రులను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారయణ, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక అలా, ఎస్పీ వినీత్‌, ఐటీడీఏ పీవో ప్రతీక్‌ జైన్‌ కూడా మంత్రులను కలుసుకున్నారు.

Updated Date - 2023-12-11T03:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising