బెస్త వర్సెస్ ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ.. రాళ్లు, కర్రలతో బీభత్సం
ABN, First Publish Date - 2023-04-07T11:44:24+05:30
మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఇసాయిపేట్ గ్రామానికి చెందిన బెస్త కులస్తులు మంతానిదేవునిపల్లికి చెందిన ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ జరిగింది.
కామారెడ్డి : మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఇసాయిపేట్ గ్రామానికి చెందిన బెస్త కులస్తులు మంతానిదేవునిపల్లికి చెందిన ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు కర్రలతో ఇరు కులస్తులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. ఇసాయిపేట్ శివారులో గల చెరువులో చేపలు పట్టే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇసాయిపేట్ శివారులో గల చెరువులో చేపలు పట్టే హక్కు తమకే ఉందని బెస్త కులస్తులు చెబుతున్నారు. ఈ చెరువులో చేపలు పట్టే హక్కు తమకు కూడా ఉందని ముదిరాజ్ కులస్తులు చెబుతున్నారు. గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీసులు సముదాయిస్తున్నారు.
Updated Date - 2023-04-07T11:44:24+05:30 IST