ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మండలాలకు అయోధ్య అక్షింతలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:10 PM

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ద్వారా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అక్షింతలు వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఈనెల 7న జిల్లాకు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైదరాబాద్‌ నుంచి తీసుకురాగా శోభయాత్రతో మంగళవాద్యాలతో జిల్లా కేంద్రంలో ఘనస్వాగతం పలుకిరారు.

కొడంగల్‌/వికారాబాద్‌, డిసెంబరు 17: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ద్వారా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అక్షింతలు వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఈనెల 7న జిల్లాకు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైదరాబాద్‌ నుంచి తీసుకురాగా శోభయాత్రతో మంగళవాద్యాలతో జిల్లా కేంద్రంలో ఘనస్వాగతం పలుకిరారు. అట్టి అంక్షితలను ఆదివారం వికారాబాద్‌ జిల్లాలోని మండలాలకు అందించేందుకు జిల్లా కేంద్రంలోని అనంతగిరి క్షేత్రం రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొడంగల్‌ నియోజకవర్గానికి సంబంధించి ఆయోధ్య రాముడి అక్షింతలను హిందు వాహిని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా హిందు వాహిని సభ్యులు, భక్తులు కొడంగల్‌ పట్టణంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో అక్షింతలు, కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా ప్రతీ ఇంటి గడపగడపకు ఆయోధ్య రాముడి అక్షింతలను అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లయ్యగుప్తా, ఆనంద్‌లాహోటి, కొట్రికె లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, వెంకటయ్య, సురారం రాకేశ్‌, ఓంప్రకాశ్‌, హిందు వాహిని సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising