ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లండన ఫెలోషిప్‌ గ్రహీతకు సన్మానం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:31 PM

అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లండనలోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ బయాలజీ ఫెలోషి్‌పకు ఎంపికై మంగళవారం మొదటిసారి నార్కట్‌పల్లికి వచ్చిన పెన్నా సుప్రసన్నను మిత్రులు, స్థానికులు సన్మానించారు.

నార్కట్‌పల్లిలో సుప్రసన్న దంపతులను సన్మానిస్తున్న అతడి మిత్రులు

నార్కట్‌పల్లి, డిసెంబరు 26 : అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లండనలోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ బయాలజీ ఫెలోషి్‌పకు ఎంపికై మంగళవారం మొదటిసారి నార్కట్‌పల్లికి వచ్చిన పెన్నా సుప్రసన్నను మిత్రులు, స్థానికులు సన్మానించారు. నార్కట్‌పల్లికి చెందిన పెన్నా సుప్రసన్న 10వ తరగతి వరకు ఇక్కడే చదివి ఉన్నత విద్యాభ్యాసం కోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ముంబాయిలో స్థిరపడ్డారు. అదేవిధంగా ముంబాయి బాబా అటానమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తూనే లండన(యూకే)లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ బయాలజీ ఫెలోషి్‌పకు ఎంపికై సుప్రసన్న అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి నార్కట్‌పల్లికి రాగా స్థానికులు సన్మానించారు. కాగా 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పెన్నా మధుసూదనకు ఈయన సోదరుడు. కార్యక్రమంలో పుట్టపాక మురళీధర్‌రావు, గట్టు కృష్ణయ్య, పసునూరి పాండురంగయ్య, అశోక్‌, దోసపాటి కోటయ్య, పసునూరి రమేష్‌, జెనిగె కనకయ్య, పసునూరి చంద్రశేఖర్‌, భాశెట్టి శ్రీనివాస్‌, బండారు రమేశ, ఐతరాజు రమేశ, గర్ధాసు వెంకన్న, కాశీ లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising