కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం
ABN, First Publish Date - 2023-12-11T03:18:13+05:30
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నించిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నేతలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు
అందుకే ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ఉన్నాం
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్, డిసెంబరు 10: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నించిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారని, వారిని తట్టుకోవడానికి తామంతా ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రగతి భవన్‌ను ఒక గడీలా, కేసీఆర్ సొంత ఆస్తిగా అనుభవిస్తుంటే.. ఆ గడీని బద్దలు కొట్టి ప్రజాదర్బార్ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ ఆనందంలో ఉందన్నారు.
Updated Date - 2023-12-11T03:18:14+05:30 IST