TS Polling : మధ్యాహ్నం 1గంటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం ఇదీ..
ABN, First Publish Date - 2023-11-30T14:39:02+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ 39.20 శాతంగా నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ 39.20 శాతంగా నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో 44.14% శాతంగా నమోదయ్యిందని ఈసీ వెల్లడించింది. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో 36.43%, తుంగతుర్తిలో 52.65%, హుజూర్‌నగర్ 48.61%, కోదాడ 38.3% చొప్పున ఓటింగ్ శాతం నమోదయ్యింది.
ఇక నల్గొండ జిల్లాలో 39.20% పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలోని నియోజకవర్గాల విషయానికి వస్తే నల్గొండ 41.06%, దేవరకొండ 33.4%, మిర్యాలగూడ 39.21%, మునుగోడు 42.33%, నకిరేకల్ 39.49%, నాగార్జునసాగర్ 40.20% పోలింగ్ నమోదయ్యింది.
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో 34%, ఆలేరు 47% నమోదయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం మధ్యాహ్నం 1 గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ 39.14 శాతంగా నమోదయ్యింది. జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో 37 శాతం, ఇల్లందులో 38 శాత, కొత్తగూడెంలో 33 శాతం
అశ్వారావుపేటలో 44 శాతం, భద్రాచలంలో 47 శాతం చొప్పున నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో 1 గంట సమయానికి 42. 17 శాతంగా పోలింగ్ రికార్డ్ అయ్యింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 28.03 శాతం, భువనగిరిలో 43% నమోదయ్యింది. మెదక్ జిల్లా సగటు పోలింగ్ 1 గంట సమయానికి 50.80 శాతంగా ఉంది. మెదక్ నియోజకవర్గంలో 50.62%గా నమోదయ్యింది.
నర్సాపూర్ నియోజకవర్గంలో 50.97 శాతంగా రికార్డ్ అయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1 గంటల వరకు పోలింగ్ 39.66 శాతంగా రికార్డయ్యింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 35.60%, బోధన్‌లో 36.41%, బాన్స్‌వాడలో 53.20%, నిజామాబాద్ అర్బన్ - 33.41%, నిజామాబాద్ రూరల్ - 43.38%, బాల్కొండ - 38.90%గా నమోదయ్యింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 41.15% నమోదు కాగా కామారెడ్డి నియోజకవర్గంలో 34.62%, ఎల్లారెడ్డిలో 45.61%, జుక్కల్‌లో 43.24%గా నమోదయ్యింది.
ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1 గంట సమయానికి పోలింగ్ 42.11 శాతంగా నమోదయ్యింది. వికారాబాద్ జిల్లాలో 1 గంట వరకు 44.89శాతంగా పోలింగ్ నమోదయ్యింది.
Updated Date - 2023-11-30T14:46:53+05:30 IST