విపత్తు నిర్వహణకు అర్వింద్ కుమార్
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:35 AM
గత ప్రభుత్వంతో అంటకాగిన బ్యూరోక్రాట్లపై రేవంత్ సర్కారు బదిలీ వేటువేసింది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎ్‌సలను లూప్‌లైన్‌కు పంపింది.
ఆయన స్థానంలో దానకిశోర్
భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
బుర్రా వెంకటేశానికి విద్యాశాఖ
వైద్య ఆరోగ్యశాఖకు క్రిస్టినా చోంగ్తు
హైదరాబాద్ సీసీఎస్‌కు రంగనాథ్
కీలక పోస్టుల్లో మహిళా ఐపీఎస్‌లు
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌డీసీపీగా శ్రీబాలాదేవి
సీసీఎస్ డీసీపీ (డిటెక్టివ్)గా శ్వేత
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంతో అంటకాగిన బ్యూరోక్రాట్లపై రేవంత్ సర్కారు బదిలీ వేటువేసింది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎ్‌సలను లూప్‌లైన్‌కు పంపింది. కొత్త టీమ్‌ను రంగంలోకి దింపింది. ఈ మేరకు 11 మంది ఐఏఎ్‌సలు, పలువురు ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్ అంతగా ప్రాధాన్యం లేని విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. గతంలో ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) లీజుకు సంబంధించి రేవంత్‌రెడ్డి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా.. అర్వింద్‌కుమార్ సహకరించకపోవడం తెలిసిందే..! దాంతో రేవంత్ కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా హైదరాబాద్ వాటర్‌వర్క్స్ ఎండీ దానకిశోర్‌కు బాధ్యతలను అప్పగించారు. దానకిశోర్‌కు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ చీఫ్‌గా అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. బుర్రావెంకటేశంను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. నిజానికి ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో కీలక బాధ్యతను అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఉస్మానియా వైద్య కళాశాల నుంచి డాక్టర్‌గా పట్టా అందుకున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తుకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. నాలుగు రోజుల క్రితమే సీనియర్ ఐఏఎస్ శైలజారామయ్యార్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించినా.. కీలక బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షకు కూడా ఆమె హాజరు కాలేదు.
హైదరాబాద్‌కు పలువురు ఐపీఎ్‌సలు
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పలువురు ఐపీఎ్‌సలకు స్థాన చలనం కలిగింది. ఇద్దరు మహిళా అధికారులకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ డీసీపీ వంటి కీలక పోస్టులు దక్కాయి. ఆరేడేళ్లుగా అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవారికి, వెయిటింగ్‌లో ఉన్న కొందరికి తాజా బదిలీల్లో ప్రాధాన్య పోస్టులు రాగా.. ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్నవారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా, వెయిటింగ్‌లో ఉన్న ఏవీ రంగనాథ్‌ను క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ సీపీగా, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా, జోయల్ డేవి్‌సను స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీగా, సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతకు సీసీఎస్ డీసీపీ(డీడీ)గా, వెయిటింగ్‌లో ఉన్న ఎస్.సుబ్బరాయుడుకు హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా, ఎన్.వెంకటేశ్వర్లు(నాన్‌క్యాడర్)కు హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా, రాచకొండ రోడ్ సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీబాలాదేవి(నాన్‌క్యాడర్)కి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, మాదాపూర్ డీసీపీ సందీ్‌ప(నాన్‌క్యాడర్)కు రైల్వే అడ్మిన్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న నితికపంత్, హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా ఉన్న డి.శ్రీనివా్‌స(నాన్‌క్యాడర్), రైల్వే అడ్మిన్ ఎస్పీగా ఉన్న జె.రాఘవేందర్‌రెడ్డి(నాన్‌క్యాడర్), సీసీఎ్‌సలో జాయింట్ సీపీగా ఉన్న గజరావ్ భూపాల్, ఉత్తరమండలం డీసీపీగా ఉన్న చందనాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
Updated Date - Dec 18 , 2023 | 02:35 AM