ప్రజా తీర్పును గౌరవిస్తాం
ABN, First Publish Date - 2023-12-04T22:23:10+05:30
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు
బెల్లంపల్లి, డిసెంబరు 4: ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమ స్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు బీఆర్ ఎస్ నాయకులపై దాడి చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులు, కార్య కర్తలను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలుగజేసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కోట్ల రూపాయలను గడ్డం వినోద్ ఖర్చు చేశారని, బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనం దుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మనో దైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని సూచిం చారు. జెడ్పీవైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత,వైస్ చైర్మన్ సుద ర్శన్, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T22:23:12+05:30 IST