ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాం

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:20 PM

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్ట ణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

లక్షెట్టిపేటరూరల్‌, డిసెంబరు 18: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్ట ణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుతోపాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ కాంతయ్య, ఎంపీపీ అన్నం మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చుంచు సదానందం, తహసీల్దార్‌ రఘునాధ్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, పార్టీ పట్టణా ధ్యక్షుడు ఎండీ ఆరీఫ్‌, మండల అధ్యక్షుడు రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

హాజీపూర్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో 116 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పం పిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డానికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తానన్నారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, వైస్‌ ఎంపీపీ రమాదేవి, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

గూడెం ఎత్తిపోతల ద్వారా నీరందిస్తాం

దండేపల్లి: యాసంగిలో రైతులకు గూడెం సత్య నారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 106 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసే సాగునీటిని మొదట చెరువులో నింపుకొని పంటలకు వాడుకోవాలని రైతులకు సూచించారు. గత ప్రభుత్వ హయంలో ధాన్యం కొనుగోలులో 40 కిలోల బస్తాకు 4, 5 కిలో లు అదనంగా తూకం వేసేవారని, అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి అదనంగా తూ కం వేయవద్దని హెచ్చరించానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో రెండు అమలు చేస్తున్నామని, సంకాంత్రి నుంచి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రారంభిస్తామ న్నారు. సంక్షేమ పథకాలు అందించుటలో ఎవరైనా కమిషన్‌ అడిగితే వారిని చెప్పుతో కొట్టాలన్నారు. ఎమ్మెల్యేకు పార్టీనాయకులు, ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, జడ్పీటీసీ నాగరాణిత్రిమూర్తి, ఎంపీడీవో మల్లేషం, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ, సర్పంచులు, ఎంపీ టీసీలు, పార్టీ మండల అధ్యక్షకార్యదర్శు వెంకటే శ్వర్లు, సతీష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:20 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising