ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతన్నకు వాన భయం

ABN, First Publish Date - 2023-12-05T22:44:07+05:30

రైతన్నకు వాన భయం వెంటాడుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ అన్నదాతకు వణుకు పుట్టిస్తోంది. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి.

నెన్నెల, డిసెంబరు 5: రైతన్నకు వాన భయం వెంటాడుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ అన్నదాతకు వణుకు పుట్టిస్తోంది. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. పలు మండలాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతన్నకు దిగులు పట్టుకుంది. దిగుబడులు చేతికొస్తున్న వేళ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.

కళ్లాల్లోనే ధాన్యం రాశులు

జిల్లాలో సగానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక, ప్రైవేటు వ్యాపారుల ధర గిట్టుబాటు కాక ధాన్యం కుప్పలు కళ్లాల్లోనే ఉన్నాయి. రైతులు ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం రాశులు పోసుకొని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను నామ మాత్రంగా ప్రారంభించారు. కాని ధాన్యం సేకరణ మాత్రం మొదలు పెట్టలేదు. రైతులు కోతలు పూర్తి చేసుకొని రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ తరుణంలో వర్షం భయం రైతులకు పట్టుకుంది. వాన నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పి తెల్లవార్లు జాగారం చేస్తున్నారు. ధాన్యంలో తేమ తగ్గించేందుకు ఆరబెట్టి చినుకులు మొదలు కాగానే కుప్పగా చేసి కవర్లు కప్పాల్సి వస్తోంది. కూలీలతో కోత కోసిన పొలాల్లో వరి మెదలు ఎత్తని రైతులు దేవుడి మీద భారం వేసి రోజులు గడుపుతున్నారు. వర్షం వస్తే మెదలు ఎత్తని పొలాల్లో ధాన్యం మొలకెత్తి పనికిరాకుండా పోతుందని రైతులు అంటున్నారు. పంట దిగుబడులు కొనేందుకు కుంటిసాకులు చెప్పే వ్యాపారులు తడిసిన ధాన్యం వైపు కన్నెత్తి కూడా చూడరని పేర్కొన్నారు. ఇక కోతలు పూర్తికాని పొలాల్లో వర్షం వస్తే మాత్రం పనులు సాగవని, హార్వెస్టర్లు దిగబడటంతో కోతలకు కష్టం అవుతుందంటున్నారు. గత సంవత్సరం ఇదే విధంగా వర్షం రావడంతో కొనుగోలు కేంద్రాల్లోనే వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైన అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

80 శాతం పత్తి చేలల్లోనే

లక్షల పెట్టుబడులు పెట్టి పత్తి పంట సాగు చేసిన రైతులకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పూత, గూడ సమయంలో వర్షాలు లేక అంతంత మాత్రమే కాత కాసింది. ఉన్న కాస్తా పత్తిని ఏరేందుకు కూలీల దొరక్క సేకరణ వెనుకబడింది. ఈ పాటికి మొదటి విడత పత్తి సేకరణ పూర్తి కావాల్సి ఉండగా. కూలీల కొరత వల్ల కొన్ని చేలల్లో ఇంక పత్తి తీత మొదలే పెట్టలేదు. వాన భయానికి ఎక్కువ ధర చెల్లించి వలస కూలీలతో పత్తి సేరించాల్సి వస్తోంది. ఇంకా 80 శాతం పత్తి చెట్లపైనే ఉంది. మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తుండటంతో చేతికొచ్చే సమయంలో పంట చేజారుతుందోమో అనే గుబులు రైతులకు పట్టుకుంది. వర్షంలో తడిసి బరువైన పత్తి పింజలు చెట్టు నుంచి జారి కింద పడతాయని చెబుతున్నారు. నేలరాలిన పత్తి పనికిరాకుండా పోతుందని రైతులు చెప్పారు. తడిసిన దూది పింజలు రంగు మారుతాయని, విత్తనం నల్లబడి బూజు పడుతుందని పేర్కొన్నారు. మార్కెట్లో మేలు రకం పత్తికే ధర లేదని, తడిసి రంగు మారితే ధరను అమాంతం సగానికి తగ్గిస్తారని రైతులు వాపోతున్నారు.

వర్షంతో ఇబ్బందులు

చెన్నూరు, డిసెంబరు 5 : తుఫాను ప్రభావంతో అక్కడక్కడ చిరు జల్లులు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్ష సూచనలు ఉండడంతో రైతులు ధాన్యంపై కవర్లు కప్పి ఉంచుతున్నారు. మండలంలోని ఎల్లక్కపేట, కిష్టంపేట, లింగంపల్లి, ఎర్రగుంటపల్లి, సుందరసాల, ఆస్నాద, పొక్కూరు తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన వరి కింద పడి పోతుందని రైతులు గుబులు చెందుతున్నారు. కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి ఉండడంతో వర్షాలు పడితే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-12-05T22:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising