ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పోరు ఆగదు

ABN, First Publish Date - 2023-12-04T22:24:44+05:30

ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పోరు ఎప్పటికీ ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ప్రజాస్వామ్యంలో అహంకార వైఖరిని ప్రజలు అంగీకరించనే విషయాన్ని వెల్లడించాయన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 4: ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పోరు ఎప్పటికీ ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ప్రజాస్వామ్యంలో అహంకార వైఖరిని ప్రజలు అంగీకరించనే విషయాన్ని వెల్లడించాయన్నారు. సీపీఐ తన గళాన్ని చట్టసభల్లో వినిపించేందుకు ప్రజ లు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సీపీఐ మిత్రపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రజలు గెలిపించ డం సంతోషంగా ఉందన్నారు. ఎర్రజెండా పార్టీలు ఎప్పుడు అధికారం కోసం తాపత్రయపడవని, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి పోరాటాలు సాగిస్తాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా పాలన అందించ డానికి తమ వంతు పోరాటాలు ఉంటాయని తెలిపారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, జిల్లా కార్య వర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్‌, జోగుల మల్లయ్య, ఖలీందర్‌ఆలీఖాన్‌, నాయకులు పౌలు, రాజేశ్వర్‌రావు, దేవవరం, పోచన్న, లక్ష్మీనారాయణ, రాజేశం, రవీందర్‌, మహేందర్‌రెడ్డి, శంకరయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T22:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising