ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN, First Publish Date - 2023-12-10T22:10:23+05:30

భీమారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌ 14 హ్యాండ్‌బాల్‌ బాలికలు, బాలుర పోటీలు ఆదివారం ముగిశాయి.

భీమారం, డిసెంబరు 10 : భీమారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌ 14 హ్యాండ్‌బాల్‌ బాలికలు, బాలుర పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్‌ పోటీల్లో బాలికల విభాగంలో ఆదిలాబాద్‌-వరంగల్‌ జట్లు తలపడగా ఆదిలాబాద్‌ జట్టు విజయం సాధించింది. అలాగే బాలుర విభాగంలో వరంగల్‌ -కరీంనగర్‌ జట్లు తలపడగా వరంగల్‌ జట్టు విజయం సాధించింది. తృతీయ స్ధానంలో బాలికల విభాగంలో కరీంనగర్‌, బాలుర విభాగంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులతోపాటు మెరిట్‌, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌లు, మెడల్స్‌ అందించారు. కాగా ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచు గద్దె రాంరెడ్డి, హెడ్మాస్టర్‌ విక్రమ్‌, టీఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ పరిమిళ, ప్రెసిడెంట్‌ గోపాల్‌, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, సదానందం, పీఈటీ విఠల్‌, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising